గత శుక్రవారం ‘ఆహా’ సంస్థ రెండు తమిళ అనువాద చిత్రాలను తెలుగువారి ముందుకు తీసుకొచ్చింది. ఇప్పటికే తమిళంలో విడుదలైన ‘ఎల్.కె.జి.’, ‘జీవీ’ చిత్రాలను డైరెక్ట్ గా ఫస్ట్ టైమ్ స్ట్రీమింగ్ చేసింది. రాబోయే శుక్రవారం కూడా ఈ సంస్థ రెండు సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. అందులో ఒకటి జనవరి 29న థియేటర్లలో విడుదలైన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కాగా, మరొకటి ఫిబ్రవరి 19న రిలీజ్ అయిన కన్నడ అనువాద చిత్రం ‘పొగరు’. ధృవ్ సర్జా, రష్మిక మందన్న జంటగా పవిత్రా లోకేశ్, ధనంజయ, రవి శంకర్ ముఖ్యపాత్రల్లో నటించిన ‘పొగరు’ చిత్రాన్ని నంద కిశోర్ తెరకెక్కించారు. ధూళిపూడి ఫణి ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలో ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించగా, అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మే మూడోవారం నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ‘ఆహా’ వీక్షకులకూ చూసే ఛాన్స్ దక్కింది.
కరోనాకు భయపడి, థియేటర్లకు వెళ్ళి ఈ సినిమాలను చూడలేక పోయిన వాళ్ళు ఎంచక్కా… ఇక ఇంట్లోనే ఆహా ఓటీటీలో ఈ రెండు సినిమాలనూ చూసేయొచ్చు.