OG Second Single: హరిహర వీరమల్లు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న తాజా చిత్రం ‘ఓజీ’. ముంబై బ్యాక్ డ్రాప్‌లో పవర్ ప్యాక్డ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక డై హార్డ్ ఫ్యాన్ పవన్‌ను ఎలా అయితే చూడాలని అనుకుంటున్నాడో.. అంతకుమించి అనేలా ఒక ఫ్యాన్ బాయ్‌గా సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా ఓజస్ గంభీరగా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన హంగ్రీ చీతా గ్లింప్స్ అంచనాలను పెంచేసింది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్‌తో ఫ్యాన్స్ ఊగిపోయారు. ఇక ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా ఒక బ్యూటీఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు.
Read Also: Khairatabad Ganesh 2025: హైదరాబాద్ ఖా శాన్.. ఖైరతాబాద్ వినాయకుడికి గవర్నర్ చేతుల మీదుగా తొలి పూజ
అయితే, సువ్వి సువ్వి అంటూ సాగుతూ.. ఓజీ ప్రేమకథలా ఉన్న ఈ సాంగ్ ఆటకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయ్యేలా ఉంది. ఫస్ట్ సింగిల్ ఫైర్ స్టార్మ్ కంటే డిఫరెంట్‌గా ఉంది. ఫస్ట్ సింగిల్ ఫ్యాన్స్ కోసం అన్నట్టుగా ఉండగా.. ఈ పాట మాత్రం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. శ్రుతి రంజనీ ఆలపించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. త్వరలోనే ట్రైలర్ రిలీజ్‌కు చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తుండగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మరి వీరమల్లుతో నిరాశ పరిచిన పవర్ స్టార్.. ఓజీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో చూడాలి.