అనేక వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఓజీ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ రోజు సెన్సార్ సర్టిఫికేట్ ని మేకర్స్ కి అందించారు. ఇక సెన్సార్ సర్టిఫికేట్ ప్రకారం ఈ సినిమా 154 నిముషాల నిడివితో ఉంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మెగా హీరోల సినిమాకి కొన్నేళ్ల తర్వాత ఏ సర్టిఫికేట్ లభించింది.
Also Read :OG : ఆ ముగ్గురి ఆశలు పవన్ కల్యాణ్ మీదే..
చివరిగా రామ్ చరణ్ తేజ నటించిన మగధీరా సినిమాకి మాత్రమే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఆ తర్వాత మెగా హీరోలు నటించిన ఏ సినిమాకి కూడా ఏ సర్టిఫికేట్ రాలేదు సుమారు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత ఏ సర్టిఫికేట్ రావడం గమనార్హం. ఇక ఈ సినిమాకి సంబంధించి సుమారు 8 కరెక్షన్స్ చెప్పింది సెన్సార్ బోర్డు. ముఖ్యంగా రక్తపాతాన్ని తగ్గించే విధంగానే ఈ సూచనలు ఉన్నాయి మొత్తం మీద సెన్సార్ బోర్డు సూచించిన సూచనల మేరకు ఒక నిమిషం 55 సెకండ్ల నిడివిగల షాట్స్ సినిమా టీం రిమూవ్ చేసింది. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ మొదలగు వారు కీలక పాత్రలలో నటించారు.