నిజానికి, పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తాడు అనుకున్నా మళ్లీ కొంతమంది నిర్మాతల వద్ద అడ్వాన్సులు తీసుకున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది దాదాపు కొంతవరకు నిజమవి తెలుస్తోంది. అయితే ఆయన కే.వి.ఎన్ ప్రొడక్షన్స్ నుంచి కూడా అడ్వాన్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ ఇప్పటికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయలేదు, కానీ టాప్ హీరోలతో ప్రాజెక్టులు సెట్ చేస్తోంది. ఇప్పటికే బాబీ-చిరంజీవి సినిమాతో పాటు తమిళంలో విజయ్ సినిమా, కన్నడలో యశ్ ‘టాక్సిక్’ సినిమా నిర్మిస్తోంది. అదే సంస్థ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇవ్వగా, ఆ సినిమాని లోకేష్ కనగరాజు డైరెక్ట్ చేస్తాడని రెండు మూడు రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది.
Also Read : Kantara: Chapter 1: కాంతార విజయం వెనుక రిషబ్ శెట్టి పేరు మార్పు కారణమా..?
వాస్తవానికి లోకేష్ కనగరాజు, పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు, కానీ ఆయన దగ్గర సాలిడ్ స్క్రిప్ట్ ఏదీ లేదు. మరోపక్క, ఒక కొత్త కుర్రాడు డైరెక్ట్ చేసుకోవడం కోసమని ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు. హీరో గుడ్డివాడు అనే లైన్ లో ఈ స్క్రిప్ట్ ఉందట. అయితే, దాన్ని కూడా కే.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ హోల్డ్ చేసింది. ఆ దర్శకుడితోనే సినిమా చేయిస్తారా లేక లోకేష్ తో ఈ సినిమా పవన్ కళ్యాణ్ కోసం సిద్ధం చేయిస్తున్నారా అని చర్చ జరుగుతోంది. వాస్తవానికి, ‘హీరో గుడ్డివాడు’ అనే కాన్సెప్ట్ తో గతంలో రవితేజ ‘రాజా ది గ్రేట్’ చేశారు. ఇప్పుడు అదే లైన్ లో ఈ సినిమా కూడా ఉండడంతో, అసలు పవన్ కళ్యాణ్ కి ఈ సబ్జెక్టు సూట్ అవుతుందా, ఆయన కోసమే కదా హోల్డ్ చేశారా లేక ఇంకెవరి కోసమైనా చేశారా అని చర్చలు జరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ విషయంలో పూర్తి గందరగోళం అయితే నెలకొని ఉంది.