కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్ 1’ అక్టోబర్ 2న విడుదలై ఎలాంటి హిట్ అందుకుంది చెప్పక్కర్లేదు. రెండు వారాల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ బాక్సాఫీస్ ను షాక్ చేసిన రికార్డులను సృష్టించింది. ఈ చిత్రం క్రీ.శ. 300లో కడంబ రాజవంశం కాలాన్ని నేపథ్యంగా, తెగల, ఆధ్యాత్మిక సంప్రదాయాలను చూపుతూ, అద్భుతమైన విజువల్స్, పటిష్టమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, చక్కని కథనంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడు. కన్నడ సినిమా అయినప్పటికీ ఈ విజయం అన్ని భాషల్లో ప్రసారం కావడంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ మూవీ హిట్ తో వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న రిషబ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సక్సెస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టారు..
Also Read : Samantha: విడిపోవడం, అనారోగ్యం.. అన్నీ బహిరంగంగానే ఎదుర్కొన్నా..
రిషబ్ మాట్లాడుతూ.. ‘ నా అసలు పేరు ప్రశాంత్, కానీ ‘రిషబ్’ గా మార్చుకున్న. సినిమా రంగంలో రాణించాలన్న కోరికతో, మా నాన్న సలహాతో పేరు మార్చుకున్నాను. ఆయన పెద్ద జ్యోతిష్యుడు కాబట్టి నా జాతకాన్ని బట్టి ‘రిషబ్’ అని పెట్టాలని సూచించారు. నిజంగా పేరు మార్చిన తర్వాత నా జీవితం మలుపు తిరిగి అదృష్టం కలిసింది. చిన్న గ్రామం నుంచి వచ్చి కష్టపడి, సినిమా రంగంలో అడుగుపెట్టిన, మొదట నా లైఫ్ కూడా అందరి లాగానే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న. కానీ పేరు మారిన తర్వాత నా లైఫ్ కొంచెం మారుతూ వచ్చింది. ‘కాంతార’ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించా’ అంటూ చెప్పుకొచ్చాడు. మనం ఇప్పటికే చాలా మంది నటినటులు పేర్లు మార్చుకోవడం చూశాం. అలాగే రిషబ్ కూడా పేరు మార్చుకుని తన అదష్టిన పరీక్షించుకున్నారు.