Site icon NTV Telugu

OG Shooting: ముంబయిలో ముగించి.. బెజవాడలో మొదలెట్టాలి?

Og

Og

పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందన్న సంగతి తెలిసిందే. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం ముంబాయి షెడ్యూల్ నిన్నటితో (జూన్ 3, 2025) విజయవంతంగా ముగిసింది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర యూనిట్, ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ కోసం సిద్ధమవుతోందని సమాచారం.

Also Read: IND vs PAK: భారత్ అభ్యంతరం.. పాక్‌కు ఏడీబీ బ్యాంక్ $800 మిలియన్ల ప్యాకేజీ..

రేపటి నుంచి (జూన్ 5, 2025) విజయవాడలో ఓజీ సినిమా షూటింగ్‌లో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో సినిమా టోటల్ షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్,, సుజీత్ మార్క్ డైరెక్షన్‌తో పాటు హై-ఓక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లనున్నాయని అంటున్నారు. ఓజీ చిత్రం డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు.

Also Read: Pawan Kalyan : వీరమల్లు నిర్మాతకు అడ్వాన్స్ తిరిగిచ్చిన పవన్ కల్యాణ్.. !

ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ లాంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతూ, అభిమానులకు విజువల్ ట్రీట్‌గా ఉండనుందని టీం చెబుతూతోంది. ముంబాయిలో జరిగిన షూటింగ్‌లో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు, కీలక డ్రామా సీక్వెన్స్‌లను చిత్రీకరించినట్లు సమాచారం. ఇప్పుడు విజయవాడ షెడ్యూల్‌లో మిగిలిన కొన్ని క్లైమాక్స్ సన్నివేశాలు, ఇతర ముఖ్యమైన సీన్స్ పూర్తి చేయనున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఓజీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version