ప్రజంట్ టాలీవుడ్ లో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ పరిస్థితి ఏంటో అభిమానులకి అంతుపట్టడం లేదు. ఎందుకంటే…
Also Read : Vedam : అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్..
మొన్నటి వరకు వరుస ప్రమోషన్స్ చేస్తూ వచ్చిన ఈ మూవీ సడన్ గా రిలీజ్ విషయంలో ప్రాబ్లం లో పడుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ కి ఒకోసారి ఒకో ట్విస్ట్ తగులుతుండగా, ఇంతలోనే మళ్ళీ వాయిదా రూమర్స్ కమ్ముకున్నాయి. అయితే ఈ చిత్ర నిర్మాత ఏ ఎం రత్నం భారీగా ఈ సినిమా కోసం ఖర్చు చేసిన సంగతి తెలిసిందే. అలాగే రీసెంట్ గా ప్రమోషన్స్ ని కూడా తానే ముందుండి నడిపించారు. ఇక తాజాగా ఈ నిర్మాత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారు అనే వార్త షాకింగ్‌గా మారింది. దీంతో ఏకంగా పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి తాను తీసుకున్న అడ్వాన్స్ మొత్తం రూ.11 కోట్లు మళ్ళీ వెనక్కి ఇచ్ఛారట. ఆర్థిక ఇబ్బందులు నుంచి తప్పుకోవడానికి తోడ్పడతాయి అని చెప్పి, అలాగే సినిమా రిలీజ్‌ని కూడా ఎలాంటి ప్రెజర్ లేకుండా ముందు రిలీజ్ చేసుకోవాలని సూచించినట్లుగా సినీ వర్గాల్లో టాక్.