పవన్ కల్యాణ్ లైనప్‌లో ఉన్న మూవీస్‌లో శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక్కటి. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీ మొదలై చాలా కాలం అవుతుంది. పవన్ పొలిటికల్‌గా బిజీ కావటంతో లిస్ట్‌లో ముందున్న సినిమాలే ఇంకా పూర్తికాలేదు. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ డిలే అవుతూ వస్తోంది. అంతే కాదు మద్య లో ఈ మూవీ ఆగిపోయింది అనే టాక్ కూడా వచ్చింది. కాని ఇటివల సెట్లో అడుగు పెట్టి ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ముగించుకున్న పవన్, తాజాగా ‘OG’ మూవీ షూటింగ్లో కూడా జాయిన్ అయ్యాడు. ఇక దీంతో అభిమానుల చూపు ఒక్కసారిగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పడింది.
పక్కా కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ మూవీ, ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకోగా పవన్ త్వరలోనే తిరిగి స్టార్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఈ చిత్రంపై దర్శకుడు హరీష్ శంకర్ అంచనాలు పెంచేలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. ‘పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులకు బెస్ట్ చిత్రాన్ని అందించేందుకు మా యూనిట్ ప్రయత్నిస్తుంది. నేను మరింత కృషి చేస్తున్నాను ఆయన రావడం ఆలస్యం.. అంత సిద్ధం చేసి ఉంచాను’ అంటూ హరీష్ శంకర్ తాజాగా కామెంట్ చేశారు. దీంతో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందా అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ప్రజంట్ హరీష్ మాటలు వైరల్ అవుతున్నాయి.