పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఇటీవలఎన్నికలకు ముందు సగం షూటింగ్ చేసి మధ్యలో ఆపేసిన సినిమాలను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజి (OG ) సినిమాలను పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే క్రిష్ దర్శకత్వంలో మొదలు పెట్టిన హరిహర వీరమల్లు షూటింగ్ ను ఇటీవల తిరిగి స్టార్ట్ చేసాడు. విజయవాడలో ఇందుకోసం ప్రత్యేక సెట్స్ నిర్మించారు మేకర్స్.
కాగా పవన్ నటిస్తున్న మరో చిత్రం OG. స్టైలిష్ మేకర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ లో త్వరలోనే పాల్గొనబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.హరిహర వీరమల్లు కంటే కూడా OG కోసమే ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. కాగా తాజాగా విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన దేవర విడుదలకు ముందు OG సినిమా రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను రూ. 110 కోట్లు చెప్పారట. దేవర భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో ట్రెండ్ మారిందని గ్రహించిన OG నిర్మాతలు, ఇప్పుడు మారిన థియేటర్ ట్రెండ్ చూసి పవన్ స్టార్ సినిమా రైట్స్ ను రూ. 150 కోట్లు చెబుతున్నారని ఇండస్ట్రీ టాక్. అయినప్పటికీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకునేందుకు బయ్యర్స్ ఎగబడుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర లో OG విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.