Passion : శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ‘పేషన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు పెద్ద హిట్ అవుతున్నాయి. పాటల రూపంలోనో మంచి మెసేజ్ రూపంలోనో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ సుధీస్ హీరోగా, అంకిత హీరోయిన్స్‌గా, అరవింద్ జాషువా దర్శకత్వంలో ‘పేషన్’ అనే మూవీ తెరకెక్కుతుంది. REDANT క్రియేషన్స్ బ్యానర్ పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. ఇందులో భాగంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ..
Also Read: NTR Neel : ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌లో శృతిహాసన్..!
Also Read
- Pallaburusu: టూత్‌బ్రష్‌తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
- Aamir Khan: సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా ‘3 ఇడియట్స్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన ఆమిర్ ఖాన్
‘అరవింద్ జాషువా ‘ఆనంద్’ సినిమా నుంచి నాకు పరిచయం. అప్పట్లోనే నాకు తనలో స్టోరీ టెల్లింగ్, రైటింగ్ క్రియేటర్ ఉన్నాడని అనిపించింది. తను పేషన్ అని ఒక నవల రాశారు. అది నేను చదివాను. చాలా బాగుంది. తను వచ్చిన ఫ్యాషన్ బ్యాక్ గ్రౌండ్ గురించి ఇందులో రాశారు. అందుకే చాలా అథెంటిక్‌గా అనిపించింది. ఈ మూవీ చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అరవింద్ మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. స్క్రిప్ట్ చాలా బాగుంది. నిర్మాతలు అందరూ కొత్తవారే. వాళ్ళందరికీ కంగ్రాట్యులేషన్స్. ఈ పోస్టర్ డిజైన్ చాలా బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. కొత్త ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలుని ఆడియన్స్ కచ్చితంగా ఆదరిస్తారు. అలాగే ఈ సినిమాని కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్’ అని తెలిపారు. అనంతరం డైరెక్టర్ అరవింద్ జాషువా మాట్లాడుతూ..
‘ ‘పేషన్’ సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాలి అంటే.. చాలా పెద్ద పెద్ద వాళ్ల పిల్లలు చదివే ఒక ఫ్యాషన్ కాలేజీలో నాలాంటి ఒక సామాన్యుడు చదివితే ఎలా ఉంటుందో ఒరిజినల్‌గా నేను ఫీల్ అయి రాసిన కథ ఇది. నేను శేఖర్ కమ్ముల గారికి ఏకలవ్య శిష్యుడిని. ఆయనతో 20 ఏళ్లుగా జర్నీ ఉంది. శేఖర్ కమ్ముల గారి పేషన్ చూసి నాకు సినిమా ఇండస్ట్రీపై గౌరవం పెరిగింది . మా నిర్మాతలు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా కంటే ముందు ఈ కథ ఒక నవలగా పబ్లిష్ చేసిన ఛాయా పబ్లికేషన్స్ వారికి ధన్యవాదాలు. డిఓపి సురేష్ నటరాజన్ సినిమాకి మెయిన్ పిల్లర్. మ్యూజిక్ డైరెక్టర్ హెర్నీ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చాడు. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకొస్తాను. గాంధీ గారు చాలా పెద్ద ఆర్ డైరెక్టర్ నా మీద నమ్మకంతో ఈ ప్రాజెక్టులోకి వచ్చి చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. టైటిల్ సూచించినట్లుగా ఇది ఇంటెన్స్ ఎమోషన్స్ తో కూడిన లవ్ స్టోరీ. ఇందులో న్యూ టాలెంట్ సుధీస్, అంకిత చాలా పేషన్ తో వర్క్ చేశారు. వాళ్ల పాత్రలు చాలా అద్భుతంగా ఉంటాయి. మిగతా నటీనటులు అందరూ కూడా చాలా చక్కని పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఈ జనరేషన్ కి కనెక్ట్ అయ్యే కథ ఇది. త్వరలోనే సినిమా థియేటర్స్ లోకి రానుంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
తాజావార్తలు
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్‌మ్యాన్‌ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
-
Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
-
Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?