టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్.. దాదాపుగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మరోవైపు మేలో తారక్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో పాల్గోనబోతున్నాడు. మేకర్స్ తారక్‌తో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. గతంలో ప్రశాంత్ నీల్ సినిమాలకు పని చేసిన టెక్నీషియన్లే ఈ సినిమాకు కూడా పని చేస్తున్నారట. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది..
Also Read: Naga Chaitanya : నా మూవీలో నాగచైతన్య లేరు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు..!
సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రుతి హాసన్ కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెను సంప్రదించగా, ఆమె కూడా అంగీకరించారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఈ అమ్మడు పాత్ర ఎంటీ అనే విషానికి వస్తే.. ఒక ప్రత్యేక గీతంలో శ్రుతి హాసన్ ఆడిపాడబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే ఆమె కథకు కీలకమైన పాత్రలో కూడా కనిపించనుందట. అంతే కాదు తారక్ పాత్ర ఆమె పాత్రల మధ్య ముఖ్యమైన సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.