Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
- విశాఖలో రోడ్డు ప్రమాదం
- తీవ్రంగా గాయపడ్డ డాన్స్ మాస్టర్ పండు
- డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pandu Master Injured in Visakhapatnam Road Accident: విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును వెనక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
డాన్స్ మాస్టర్ పండు మంగళవారం తగరపువలస సమీపంలో ఓ జాతరలో డ్యాన్స్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈవెంట్ ముగిసిన తర్వాత మాస్టర్ పండు తన బృందంతో కలిసి కారులో తిరిగి హైదరాబాద్ వస్తున్నాడు. ఆనందపురం సమీపంలో ఉండగా.. కారులో ఉన్న ఓ డ్యాన్సర్‌కు అస్వస్థత ఏర్పడి వాంతులు అయ్యాయి. దాంతో రోడ్డు పక్కన కారును ఆపారు. ఈ సమయంలో వెనుక నుంచి వేగంగా కోళ్ల లోడుతో వచ్చిన బొలెరో వాహనం కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Also Read
- Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
- Peddi Ticket Prices Hike: 'పెద్ది' సినిమా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. రోజుకు 5 షోలకు అనుమతి.!
- Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
- NBK 111: ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’!
పండు మాస్టర్‌తో పాటు కారులో ప్రయాణిస్తున్న మరికొందరు కూడా ఈ ప్రమాదంలో గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
-
DK Shivakumar: కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్.. నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల లిస్ట్ ఇదే.!
-
Pension Scheme: నెలకు రూ.55 పెట్టుబడి..రిటైర్ అయ్యాక నెలనెలా అకౌంట్లోకి డబ్బులు..ఈ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ గురించి తప్పక తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్‌తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!