Site icon NTV Telugu

OG : రూ. 500 కోట్ల మార్క్ ను OG అందుకోవడం కష్టమే

Og

Og

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. గతేడాది కల్కి, పుష్ప2తో వెయ్యికోట్లు కొల్లగొట్టి దేవరతో 500 క్రోర్ మార్క్ క్రాస్ చేసిన టీటౌన్.  ఈ ఏడాది రూ. 500 క్రోర్ మార్క్ ను అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. బాలీవుడ్ ఇప్పటికే ఛావా, సైయారాతో టార్గెట్ ను అందుకున్నాయి. కోలీవుడ్ కూడా కూలీతో ఫైవ్ హడ్రెండ్ క్రోర్ టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్2, లోక 250 ప్లస్ కలెక్షన్లతో ఆల్ టైం హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాలను చవిచూసింది కేరళ ఇండస్ట్రీ. కానీ టాలీవుడ్ మాత్రం చతికిలపడుతోంది.

ఈ ఏడాది టాలీవుడ్‌లో బోలెడు పాన్ ఇండియా చిత్రాలు వచ్చాయి. గేమ్ ఛేంజర్, ఢాకూ మహారాజ్, హిట్3, కుబేర, హరి హర వీరమల్లు, కింగ్డమ్ ఇలా ఓ పది పాన్ ఇండియా సినిమాలు వచ్చి బిగ్ నంబర్ కోసం ట్రై చేశాయి కానీ రూ. 200 కోట్లు కూడా రీచ్ కాలేకపోయాయి.   ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన OG చిత్రం రూ. 500 కోట్ల మార్క్ ను అందుకుంటుందని ట్రేడ్ అంచనా వేసింది. భారీ హైప్, అంతే స్థాయిలో ప్రీమియర్స్, టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇలా అన్ని వనరులు సమకూర్చిన ఈ సినిమా తొలిరోజు రూ. 154 కోట్లతో బిగ్గెస్ట్ స్టార్ట్ అందుకుంది. కానీ ఆ తర్వాత కూడా డీసెంట్ గా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా హైప్ కి సరిపడా వసూళ్లు అయితే రాబట్టలేదు. ఇప్పటివరకు రూ. 265 కోట్లు గ్రాస్ రాబట్టింది. ఇక రూ. 500 టార్గెట్ ను అందుకోవడం అనేది జరగని పని. మరి ఈ ఏడాది ఏ సినిమా ఈ బిగ్ టార్గెట్ ను అందుకుంటుందో చూడాలి.

Exit mobile version