Site icon NTV Telugu

OG : పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త..

Ogshoot

Ogshoot

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త తెరమీదకు వచ్చింది. అసలు విషయం ఏమిటంటే, ఓజీ సినిమాకు సంబంధించి పవన్ కళ్యాణ్ పాత్ర షూటింగ్ పూర్తయినట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ‘గంభీర’ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. అలాగే, 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 25వ తేదీన ఒక అగ్ని తుఫాన్ రాబోతోందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో ఈ ఓజీ సినిమా రూపొందుతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను డి.వి.వి. దానయ్య అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

Also Read: Minister Uttam: కాళేశ్వరం వైఫల్యానికి ప్రధాన కారణం కేసీఆర్, హరీష్ రావులే..

ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అభిమానులలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్‌లో రాబోతుందా, రాదా అనే అనుమానాల నేపథ్యంలో, తాజాగా సినిమా యూనిట్ ప్రకటించిన ప్రకటన పవన్ అభిమానులకు ఒక రకంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.

Exit mobile version