ఇప్పటి తెలుగు సినిమాలు పాన్-ఇండియా మార్కెట్లో సక్సెస్ సాధించడానికి ప్రధానమైన మార్గంగా మారాయి. పెద్ద తారలు, భారీ బడ్జెట్లు, హిందీ, తమిళ, కన్నడ మార్కెట్లో రిలీజ్ చేయడం ఇప్పుడు కామన్ అయింది. కానీ,అప్పట్లో పాన్-ఇండియా ట్రెండ్ మొదలయ్యే ముందు, తేలుగు హీరోలు నిజాయితీగా ఉండేవారు. అందుకు ఉదాహరణ తారక రామారావు. అవును..
Also Read : Kiran Abbavaram : వెడ్డింగ్ డే సేలబ్రేషన్లో.. కిరణ్-రహస్య క్యూట్ మూమెంట్స్
ప్రస్తుతం ప్రేక్షకులు “పాన్-ఇండియా” ట్యాగ్ చూస్తే చాలా బ్లాక్ బాస్టర్ అనే ఆలోయనకు వచ్చేస్తున్నారు. కానీ అప్పట్లో తెలుగు సినిమా మార్కెట్‌కి పరిమితం అయి, ఇతర భాషల్లో రిలీజ్ చేయడం పెద్ద రిస్క్ అని భావించేవారట. అలాంటి సందర్భంలో తారక రామరావుకి ప్రత్యేక ఆఫర్ వచ్చిందట. “మీరు కృష్ణుడి, రాముడి పాత్రను హిందీలో చేయండి. మేము తీస్తాం, మీకు కోటి రూపాయలు పారితోషికం ఇస్తాం” అని భారీ ఆఫర్ ఇచ్చారు. దానికి ఆయన “కోటి వద్దు. 10 లక్షలు ఇచ్చి, ఇదే మూవీ తెలుగులో తీయండి చేస్తా’ అని చెప్పారట. ఆ కాలంలో కోటి రూపాయలు అంటే చిన్న విషయం కాదు. అలాంటి ఆఫర్‌ను తిరస్కరించడం సులభమైన విషయం కాదు. కానీ తెలుగు ప్రేక్షకుల కోసం సినిమా చేయాలనే ఆయన నిజాయితీకి ఇది నిదర్శనం అని చెప్పాలి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. తెలుగు చిత్ర పరిశ్రమ మీద ఆయన చూపిన నిజాయితీ, అంకితభావం ఇప్పుడు కూడా అభిమానుల హృదయాలలో చిరస్థాయిగా గుర్తింపు పొందుతోంది.