జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యనే డ్రాగన్ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇంకా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు, కానీ డ్రాగన్ అనే ప్రచారం జరుగుతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో జరుగుతుండగా, ఆ షెడ్యూల్‌లో పాల్గొని హైదరాబాద్ తిరిగి వచ్చాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో పూర్తవుతుంది. జూన్ 2026లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Read More: Arya@21: అల్లు అర్జున్’ను నిలబెట్టిన సినిమాకి 21 ఏళ్ళు
మరోపక్క, జూనియర్ ఎన్టీఆర్ దేవర రెండో భాగంతో పాటు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే, దేవర సెకండ్ పార్ట్ ముందు పట్టాలెక్కుతుందా లేక నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా పట్టాలెక్కుతుందా అనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. నిజానికి, డ్రాగన్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్రీ అయిపోతాడు. అయితే, ఇప్పటికే కొరటాల శివ దేవర సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పూర్తి చేసి ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాడు. ఎన్టీఆర్ డ్రాగన్ పూర్తి చేసే సమయానికి కొరటాల శివ రెడీగా ఉంటాడు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దేవర సెకండ్ పార్ట్‌తో పాటు నెల్సన్ సినిమా మీద కూడా ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాడు.
Read More: Tharun Bhascker: విశ్వక్’ను పక్కన పెట్టి దేవరకొండతో తరుణ్ భాస్కర్?
ఈ క్రమంలో ముందు జూనియర్ ఎన్టీఆర్ దేవర పూర్తి చేస్తాడా లేక నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాను కూడా అదే సమయంలో నడిపిస్తాడా అనేది చూడాల్సి ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించబోయే దేవర సెకండ్ పార్ట్‌ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో పాటు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు. అదే నెల్సన్ దిలీప్ కుమార్ సినిమాను మాత్రం సూర్యదేవర నాగవంశీ నిర్మించడానికి సిద్ధమవుతున్నాడు. ఒకరకంగా, ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత ఏ సినిమా మొదలు పెట్టబోతున్నాడు అనే విషయంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.