మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గతేడాది “దేవర” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ గా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. దేవరతో బాలీవుడ్ లోను తన మార్కెట్ ను పదిలం చేసుకున్నాడు తారక్. ఇటీవల జపాన్ లోను దేవర రిలీజ్ చేయగా డీసెంట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ డెబ్యూ సినిమా వార్ -2 లో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబుతున్నాడు తారక్. ఈ ఏడాది ఆగష్టు 15 విడుదల కానుంది వార్ – 2.
ఈ సినిమాతో పాటు కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను ఈ మధ్య మొదలెట్టాడు ఈ సినిమా సంక్రాంతికి 2026లో విడుదల కానుంది. అయితే తమిళ స్టార్ దర్శకుడు జైలర్, బీస్ట్ వంటి సినిమాలు డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్‌కుమార్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడు అని గత కొన్ని నెలలుగా వార్తలు వినిపించాయి. ఆ విషయాన్ని యంగ్ టైగర్ నిన్న జరిగిన మ్యాడ్ సక్సెస్ మీట్ లో కన్ఫర్మ్ చేసాడు. 2026లో ఎన్టీఆర్ మరియు నెల్సన్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా వేరే లెవల్ లో ఉంటుందని, ఎవరు ఊహించలేరని సరికొత్త జానర్ లో మైండ్ బ్లోయింగ్ వర్మ అనేలా ఉంటాదని సమాచారం. ప్రస్తుతం జైలర్ 2 లో బిజీగా ఉన్నాడు నెల్సన్. ఇదిలా ఉండగా ఎన్టీఆర్, నెల్సన్ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నాడు.