Noel Sean 14 Movie to Release on July 5th: రాయల్ పిక్చర్స్ బ్యానర్ మీద లక్ష్మీ శ్రీనివాస్ దర్శకత్వంలో నోయల్, విషాక ధీమాన్ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా త్రకెక్కింది. ఈ సినిమాకు ఆసక్తికరమైన టైటిల్ ఫిక్స్ చేశారు. రతన్, పోసాని కృష్ణ మురళి,శ్రీకాంత్ అయ్యంగర్, రూపాలక్ష్మి తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాకు 14 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సుబ్బారావు రాయన మరియు శివకృష్ణ నిచ్చెన మెట్ల, సంయుక్తంగా నిర్మించిన ఈ 14 సినిమా జులై 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ డైరెక్టర్ వీర శంకర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వీర శంకర్ మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అయినటువంటి “14” చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుందని అన్నారు. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని ఆయన అన్నారు. రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం లో ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం అందించగా ఆదిత్య భార్గవ్ మాటలు రాశారని మేకర్స్ వెల్లడించారు.