Nithin : వెబ్ సీరిస్ దర్శకుడితో నితిన్..ఎవరా దర్శకుడు.?
- హిట్ కోసం వేయి కళ్ళతో చూస్తున్న నితిన్
- ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్ లో నితిన్ ఫుల్ బిజి
- మరో రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ హీరో నితిన్ లాస్ట్ హిట్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ. ఆ తర్వాత 5 సినిమాలు చేసాడు ఈ కుర్ర హీరో. కానీ ఒక్కటి కూడా కనీసం యావరేజ్ గా కూడా నిలవలేదు. వేటికవే డిజాస్టర్ లుగా నిలిచాయి. కొంత గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఓ రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్. భీష్మాతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ‘రాబిన్ హుడ్’, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘తమ్ముడు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రాబిన్ హుడ్ ఈ ఏడాది డిసెంబరులో విడుదల చేయాలని ప్లాన్ చేయగా పుష్ప -2 రాకతో ఇప్పుడు ముందు వెనక ఆలోచిస్తున్నారు.
తాజాగా నితిన్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. దాదాపు 15 సినిమాల వరస ఫ్లాప్ ల తర్వాత ‘ఇష్క్’ రూపంలో తనకు హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు నితిన్ ఆసక్తిగా ఉన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత కె.నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేయనున్నారని సమాచారం. ఈ ఏడాదిలోనే ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. మరో వైపు ఇటీవల ఈటీవీ విన్ లో విడుదలై సూపర్ హిట్ సాధించిన ‘#90s’ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన ఆదిత్య హాసన్ చేప్పిన ఓ కథకు నితిన్ పచ్చ జెండా ఉపినట్టు ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. వరుస పరాజయాలతో సతమతమవుతున్న నితిన్ కు ఈ నాలుగు సినిమాలు హిట్ సాధించి ఈ యంగ్ హీరోను సక్సెక్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
Also Read: SanjayDutt : సంజయ్ దత్ పని కానిచ్చేసిన పూరి జగన్నాధ్..!
తాజావార్తలు
-
CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
-
TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
-
Lakshadweep: ప్రధాని మోడీ “కుర్చీ మడత పెడితే” ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
-
Iran: ప్రపంచ దేశాలకు ఇరాన్ కొత్త వార్నింగ్.. భారత్‌కు ముప్పు తప్పదా?
-
IPL 2026: ఐపీఎల్ అరంగేట్రంలోనే అదరగొట్టిన తెలుగు కుర్రాడు.. మంత్రి ప్రశంసలు..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!