బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు వేణు. బలగం వచ్చి రెండుళ్లు పైనే అవుతున్న కూడా రెండవ సినిమాను స్టార్ట్ చేయలేదు ఈ దర్శకుడు. రెండవ సినిమా కోసం చాలా కాలం కిందటే ఓ కథ రెడీ చేసుకున్నాడు. ఆ కథ అందరి చుట్టూ తిరుగుతుంది కానీ ఎక్కడ ఫైనల్ కావట్లేదు.
Also Read : K – RAMP : బాలయ్య స్టైల్ లో తన సినిమా సూపర్ హిట్ అని తొడకొట్టిన నిర్మాత
ముందుగా ఈ కథను నేచురల్ స్టార్ నాని కి వినిపించారు. కానీ సెకండ్ హాఫ్ పట్ల నాని సంతృప్తి చెందలేదు సో అక్కడ ఒకే అవ్వలేదు. అటు నుండి మరొక యంగ్ హీరో నితిన్ దగ్గరకు వచ్చి చేరింది. నితిన్ ఒకే చెప్పాడని మరికొద్ది రోజుల్లో ఈ సినిమా పట్టాలెక్కుతుందని టాక్ వినిపించింది. కానీ దిల్ రాజు బ్యానర్ లో నితిన్ చేసిన తమ్ముడు డిజాస్టర్ తో ఎల్లమ్మ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడింది. దిల్ రాజు ఈ సినిమాను పక్కన పెట్టాడని కథనాలు వినిపించాయి. ఇక ఇప్పడు లేటెస్ట్ గా ఈ కథ నితిన్ దగ్గరనుండి యంగ్ హీరో బెల్లం కొండ శ్రీనివాస్ దగ్గరకు చేరిందని టాక్ వినిపిస్తుంది. తాజాగా కిష్కింధపురితో సూపర్ హిట్ కొట్టి జోష్ మీదున్నాడు బెల్లంకొండ. ఇటీవల బెల్లంకొండను కలిసి ఎల్లమ్మ కథను వినిపిపించగా అందుకు సాయి శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచేసినట్టు తెలుస్తోంది. ఇక్కడైనా లాక్ అవుతుందా లేదా చూడాలి. హీరో ఏవైరైనా సరే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తారు.