టాలీవుడ్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఒకరు. ఆయనకు వీరాభిమానిగా పేరు పెట్టుకున్న వారిలో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. కెరీర్ ప్రారంభం నుంచి పవన్‌ను ఆదర్శంగా చూసుకుంటూ తన సినిమాల్లో ఆయనపై రిఫరెన్స్‌లు, ఎలివేషన్లు పెడుతూ వస్తున్నాడు. అంతేకాదు, పవన్ సైతం నితిన్‌కి ప్రత్యేకమైన అభిమానం చూపుతూ, అతని సినిమాలను ప్రమోట్ చేయడమే కాదు, ఛల్ మోహన్ రంగ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే తరచూ పవన్ పేరిట నితిన్ సినిమాల్లో వచ్చే రెఫరెన్స్‌లపై కొందరు విమర్శలు, సెటైర్లు వేయడం మొదలుపెట్టడంతో నితిన్ కొంత నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో..
Also Read : The Family Man 3 : ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 గ్లింప్స్ రిలీజ్..!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నితిన్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు..‘ ఈ చిత్రానికి ‘తమ్ముడు’ టైటిల్ అనుకున్నప్పుడు, మొదట నేను ఒప్పుకోలేదు. పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఇప్పటికే నేను చాలా చేస్తున్నానన్న విమర్శల నేపథ్యంలో ఆ టైటిల్ అవసరం లేదనిపించింది. కానీ దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు కథకు ఇదే బెస్ట్ టైటిల్ అని నచ్చజెప్పడంతో చివరికి అంగీకరించాను’ అని తెలిపారు నితిన్. ఈ మాటలు సోషల్ మీడియాలొ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రజంట్ వరుస ఫ్లాపులతో కష్టాల్లో ఉన్న నితిన్‌కి ఈ సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యం.