భారతీయ వెబ్‌సిరీస్‌లలో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే రెండు సీజన్లు ఘన విజయాన్ని సాధించగా, ఇప్పుడు మూడో సీజన్‌కు తెరలేపుతోంది. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో, రాజ్- డీకే దర్వకత్వంలో రూపొందుతున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌కు సంబంధించి తాజాగా మేకర్స్ ఓ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
Also Read : Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది..
ఇందులో తివారీ (మనోజ్ బాజ్‌పాయ్)ని ఒక వ్యక్తి ‘మీరు ఏం చేస్తుంటారు?’ అని ప్రశ్నించగా, ఆయన నవ్వుతూ ‘లైఫ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్‌ను’ అంటూ చెప్పిన తీరు వినోదంగా, ఆసక్తికరంగా ఉంది. ఈ సీజన్‌లోనూ గత సీజన్ల మాదిరిగా హై ఇంటెన్సిటీ యాక్షన్ సీన్లు, భావోద్వేగ సన్నివేశాలు, రహస్య మిషన్ తో నిండిన కథనంతో ప్రేక్షకులను మళ్లీ మాయ చేయనుంది. ఇక టీజర్ చివర్లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ ఈజ్ బ్యాక్!..కొత్త సీజన్ కోసం రెడీ అవ్వండి!’ అని చెప్పడం ద్వారా సిరీస్‌పై భారీగా హైప్ పెంచారు. మొత్తానికి గ్లింప్స్ చూసుకుంటే ఈ సారి థ్రిల్లింగ్ మాములుగా ఉండదు అనిపిస్తుంది.