నెట్‌ఫ్లిక్స్ కొత్త ఆంథాలజీ సిరీస్ ట్రైలర్ “రే” ఈ రోజు విడుదలైంది. ఈ సిరీస్ ప్రముఖ చిత్రనిర్మాత సత్యజిత్ రే రచనల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మనోజ్ బాజ్‌పేయి, అలీ ఫజల్, హర్షవర్ధన్ కపూర్, కే కే మీనన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంకా గజరాజ్ రావు, శ్వేతా బసు ప్రసాద్, అనిండిత బోస్, బిడితా బాగ్, దిబ్యేండు భట్టాచార్య, రాధిక మదన్, చందన్ రాయ్ సన్వాల్ … అభిషేక్ చౌబే, శ్రీజిత్ ముఖర్జీ, వాసన్ బాలా తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సిరీస్ జూన్ 25 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఇందులో అహం, పగ, అసూయ, ద్రోహం వంటి విభిన్న భావోద్వేగాల ఆధారంగా నాలుగు గ్రిప్పింగ్ కథలు ఉంటాయి. మనం కూడా కొత్త జీవితాలను సృష్టిస్తున్నాము. అందుకే మానవులు దేవుని కన్నా తక్కువ కాదని చెప్పే వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తరువాత చిత్రంలోని ప్రధాన పాత్రధారుల పాత్రలు పరిచయం అవుతాయి. ట్రైలర్ ప్రారంభంలో అన్ని పాత్రలను శక్తివంతమైన స్థానాల్లో చూపించిన మేకర్స్… చివరికి ఈ నలుగురూ పతనానికి గురైనట్లు చూపించారు. ఒక మనిషి తనను తాను దేవుడని నమ్మడం ప్రారంభించినప్పుడల్లా… అతను భారీ పతనానికి గురవుతాడు అంటూ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగుస్తుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.