చిత్ర పరిశ్రమ అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ప్రశంసలు కన్నా విమర్శలే ఎక్కువ. కొద్దిగా బెండ్ అయినా తొక్కేయాలని చూసేవారు ఎక్కువ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ప్రతి ఒక్కరు ఆదర్శవంతులుగా మారిపోతారు. పెళ్లి చేసుకొని జీవితాన్ని ఇస్తూ వెంటపడేవారు కొందరు.. ఒక్క రాత్రికి రమ్మనేవారు మరికొంతమంది.. వీటన్నింటిని ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలబడిగలిగినవారే స్టార్ హీరోయిన్లుగా మారుతున్నారు. సక్సెస్ వచ్చాకా వారి ఇబ్బందులను మీడియా ముందు చెప్తున్నప్పుడు వారి ఎలాంటి కష్టాలు పడి పైకి వచ్చారో అర్ధం అవుతూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ నీతూ చంద్ర కూడా తన జీవితంలో జరిగిన ఒక ఘటనను మీడియా ముఖంగా చెప్పుకొచ్చింది.
ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ “నాది ఒక సక్సెస్ ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ.. నేను ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాను. 13 మంది జాతీయ అవార్డులు అందుకున్న వారిపక్కన నటించాను. అన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినా ఒక రోజు నా దగ్గర ఒక్క సినిమా కూడా లేని పరిస్థితి, చేతిలో డబ్బులు లేవు. ఆ సమయంలో ఒక బడా వ్యాపారవేత్త తనను భార్యగా చేసుకుంటాను అని చెప్పాడు. అది కూడా రూ. 25 లక్షలు ఇచ్చి భార్యగా ఉంచుకొంటాను అన్నాడు. అంటే నెలకు ఆ డబ్బు తీసుకొని అతడు ఏది చెప్తే అది చేసే ఉద్యోగం. అప్పుడు నాకు అనిపించింది. ఇన్ని సినిమాలు చేశాను. ఇలాంటి ఒక పరిస్థితి నాకు వచ్చింది. అనవసరంగా నేను ఇక్కడ ఉన్నానేమో.. లేకపోతే ఇవన్నీ జరిగి ఉండకపోవచ్చు అని అనుకున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక నీతూ తెలుగువారికి కూడా పరిచయమే. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన గోదావరి సినిమాలో సుమంత్ మరదలుగా నటించి మెప్పించింది.