NBK Fans Opposing Veera Mass Title for NBK 109: నందమూరి బాలకృష్ణ ఒకపక్క వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి నిజంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు సినిమాలే కాదు రాజకీయాల్లో కూడా ఎలాంటి అపజయం లేదు అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతానికి ఆయన సినిమాలు విషయానికి వస్తే బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఇప్పటివరకు పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని ఎన్బికె 109 అని సంబోధిస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ గురించి అనేక చర్చలు జరిగాయి. తాజాగా వీరమాస్ అనే ఒక టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కానీ బాలకృష్ణ అభిమానులు మాత్రం ఇలాంటి టైటిల్ వద్దురా బాబోయ్ అన్నట్టుగా సోషల్ మీడియాలో నేరుగా కామెంట్లు చేస్తున్నారు.
Aman Preet: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సోదరుడు
ఈ సినిమా నిర్మాతగా వ్యవహరిస్తున్న నాగవంశీ సోషల్ మీడియా అకౌంట్ లో ఏకంగా ఈ టైటిల్ విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటి టైటిల్ దయచేసి రిజిస్టర్ చేయొద్దు, మా హీరో సినిమాకి దయచేసి పెట్టవద్దు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకా క్లాసిక్ టచ్ ఉన్న మాస్ టైటిల్ అయితే బాగుంటుంది కానీ ఇలాంటి టైటిల్ అయితే జనానికి ఎక్కువగా కనెక్ట్ కాకపోవచ్చు అని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. వాల్తేరు వీరయ్య ఎలాంటి హిట్ తరవాత బాబీ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతోపాటు భగవంత్ కేసరి లాంటి సినిమా హిట్ తర్వాత బాలకృష్ణ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే మరి ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారనేది పేజీ చూడాల్సి ఉంది.