Aman Preet: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సోదరుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Brother Aman Preet Named A6 in Drugs Case: హైదరాబాద్లో తాజాగా ఒక భారీ డ్రగ్స్ రాకెట్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు నటుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్టు అయ్యాడు. ప్రస్తుతం అతను పోలీసులు కస్టడీలో ఉన్నాడు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటీ పోలీసులతో పాటు రాజేంద్రనగర్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో కొంతమంది డ్రగ్స్ అమ్మకం దారులతో పాటు కొనుగోలుదారులు కూడా దొరికిపోయారు. డ్రగ్స్ కొనుగోలుదారులలో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఒకరిగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఇక ఈ రైడ్ లో దాదాపు 200 గ్రాములకు స్వాధీనం చేసుకున్నారు నార్సింగ్ పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 18 మంది మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఇక ఈ కేసులో అమన్ ప్రీత్ సింగ్ ని ఏ సిక్స్ గా నమోదు చేశారు పోలీసులు.
Jai Balayya: జై బాలయ్య అంటూ ఊగిపోయిన రానా
Also Read
అరెస్ట్ అయిన వారిలో ఐదుగురు డ్రగ్ పెడ్లర్లు ఉన్నారు. వీళ్ళ నుంచి 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు, 13 మందికి డ్రగ్ టెస్ట్ లు చేయగా.. ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. అమన్ తో పాటు.. ప్రసాద్, మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్, ధావన్ ఉన్నారు. అరెస్ట్ అయిన పెడ్లర్ల లో ఇద్దరు నైజీరియన్లు బ్లెస్సింగ్స్, నోహిమ్ లతో పాటు లోకల్ పెడ్లర్లు అల్లం గౌతం, వరుణ్ కుమార్, మహబూబ్ షరీఫ్ ఉన్నారు. కీలక నిందితుడు ఎబుకా పరారీలో ఉన్నాడు. నార్సింగి డ్రగ్స్ కేసులో ఐదుగురు నిందితులకు 14 రోజుల డిమాండ్ విధించారు. జులై 30 వరకు ఉప్పరపల్లి కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా ఆ ఐదుగురు నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు నార్సింగి పోలీసులు.
- Tags
- Aman Preet
- drugs case
- Rakul
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!