గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో కనిపించబోతున్నారు ఇటీవల రిలీజ్ అయిన దాకు మహారాజ్ టైటిల్ గ్లిమ్స్ చుస్తే అర్ధం అవుతుంది. కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ ముగించి గుమ్మడి కాయ కొట్టారు మేకర్స్.
Also Read : Manchu Breaking : కేసుల వ్యవరంపై స్పందించిన మంచు ఫ్యామిలీ
కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను భారీ ఎత్తున చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకోసం మంచి ముహుర్తాన్ని ఫిక్స్ చేశారట. ఈ నెల 15న నుండి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను US లో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. కానీ అంతకంటే ముందుగానే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అమెరికాలోని డల్లాస్ లో జనవరి 4న సాయంత్రం 6.00 గంటలకు నిర్వహిచబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. డాకు మహారాజ్ ఈవెంట్ ను ఎన్నడూ చూడని విధంగా ఎవరు చూడని విధంగా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత నాగవంశీ. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలకు థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.