Narne Nithin Promoting his Aay Movie with Fever: ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ మ్యాడ్ అనే సినిమాతో టాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి సినిమాగా ఆయ్ అనే ఒక ప్రాజెక్టు ప్రేక్షకులు ముందు వచ్చేందుకు సిద్ధమవుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అంజి కే మణి పుత్ర అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నయన్ సారిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి ఇతర కీలక పాత్రలలో నటించారు. బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 16వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. అయితే ఆగస్టు 15వ తేదీ సాయంత్రమే పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించాలని సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. సినిమాకి ఇంకా ఐదు రోజులు సమయం మాత్రమే ఉండడంతో ఇప్పటికే ప్రమోషన్స్ పెద్ద ఎత్తున చేస్తోంది సినిమా యూనిట్.
అయితే ఈ నేపథ్యంలో వరుస ప్రమోషన్స్ తో హీరో నితిన్ కి జ్వరం వచ్చింది. అయినా సరే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సినిమా ప్రమోషన్స్ కోసం ఆయన కష్టపడుతున్నాడు. ఈ ఉదయం ప్రింట్ అండ్ వెబ్ మీడియా ఇంటర్వ్యూ ఉండగా ఆయన జ్వరం కారణంగా కాస్త ఆలస్యంగా వచ్చారు. ఆ తర్వాత తాను జ్వరంతో బాధపడుతున్నానని ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని కోరారు. మొత్తం మీద ఎన్టీఆర్ బావమరిది కష్టం చూస్తుంటే రెండో సినిమాతో కూడా హిట్ కొట్టేటట్టే కనిపిస్తున్నాడు. ఎందుకంటే ట్రైలర్ కూడా అంత ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. అన్నట్టు ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.