Nani: పాకిస్తాన్ వాళ్లకు ఆ కిక్ ఉండకూడదనే.. సక్సెస్ మీట్ పెట్టా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా మే ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నాని కెరీర్లోనే అత్యంత వైలెంట్ సినిమాగా రూపొందించబడిన ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లు దాటి 150 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమాను అమెరికాలో ప్రమోట్ చేస్తూ వచ్చిన నాని తాజాగా ఇండియా వచ్చాడు. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
Read More:Rajnath Singh: పాకిస్తాన్ తాట తీయాల్సిందే.. సైన్యానికి కీలక ఆదేశాలు
Also Read
అయితే, ఇండియా-పాకిస్తాన్ మధ్య అప్రకటిత యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ సక్సెస్ మీట్ నిర్వహించాలా వద్దా అని ముందు తర్జన భర్జనలు పడ్డామని నాని చెప్పుకొచ్చాడు. అయితే, పాకిస్తాన్ ఇండియాలో ఉన్న వారి మనశ్శాంతిని దూరం చేయాలనుకుంటోంది. వారి భయానికి దక్షిణ భారతదేశంలో ఒక సినిమా సక్సెస్ మీట్ క్యాన్సిల్ అయిందనే సంతృప్తి వారికి ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడు సక్సెస్ మీట్ నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు.
Read More:OperationSindhoor: పాక్ ఆర్మీ చీఫ్ కు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఫోన్..
శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రం కేవలం ఫ్యామిలీ ఆడియన్స్‌ను మాత్రమే కాకుండా బీ, సీ సెంటర్లను టార్గెట్ చేసుకొని చేశారు. ఎవరినైతే టార్గెట్ చేసుకొని సినిమా చేశారో, ఆ టార్గెట్ బాగానే వర్కౌట్ అయింది. నానిని ఇంత వైలెంట్‌గా ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదని సినిమా చూసిన వారంతా కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో నాని నిర్వహించిన సక్సెస్ మీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే, ఎప్పుడో 16వ తేదీన జరగాల్సిన థర్డ్ లైఫ్ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్‌ను కమల్ హాసన్ క్యాన్సిల్ చేశారు. కానీ, నాని నిన్నటికి నిన్న అప్పటికప్పుడు అనుకుని ఈ ఈవెంట్ నిర్వహించడం హాట్ టాపిక్ అయింది.
తాజావార్తలు
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్‌పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్‌క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!