భారతీయ సినిమా చరిత్రలో ఎన్నో రికార్డులు సాధించిన నట సింహం నందమూరి బాలకృష్ణకి మరో అరుదైన గౌరవం దక్కింది. నందమూరి బాలకృష్ణ సినిమా జైత్రయాత్రకు మరో అద్భుత గౌరవాన్ని అందుకుంటున్నారు. లండన్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR), యూకే, యుఎస్ఎ, కెనడా, స్విట్జర్లాండ్, ఇండియా, సహా యుఎఇలలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ. ఆ సంస్థ బాలకృష్ణ ఐదు దశాబ్దాల సినిమా సేవలను WBR గోల్డ్ ఎడిషన్‌లో నమోదు చేస్తూ, ఆయనను తమ అత్యంత ప్రతిష్టాత్మక గౌరవంతో సత్కరిస్తోంది. ఈ గుర్తింపు ఆయన అసమాన సినిమా వారసత్వానికి, సామాజిక సేవలకు, మానవతావాదానికి ఒక శాశ్వత నివాళిగా నిలవనుంది.
Also Read : Coolie : ‘కూలీ’లో పాత్ర అన్యాయం అంటూ ప్రచారం.. స్పందించిన శృతిహాసన్..
50 సంవత్సరాల పాటు ప్రముఖ హీరోగా కొనసాగిన బాలకృష్ణ భారతీయ సినిమాలోనే కాక, ప్రపంచ సినిమా చరిత్రలోనూ అరుదైన ఘనత సాధించారు. తన తండ్రి, లెజెండరీ నందమూరి తారక రామారావు (NTR) గారి వారసత్వాన్ని కాపాడుకుంటూనే, బాలకృష్ణ తన శక్తివంతమైన స్క్రీన్ ప్రెజెన్స్, బహుముఖ ప్రతిభ, కళపట్ల అవిరామ నిబద్ధతతో టాలీవుడ్‌లో తనదైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. విభిన్న పాత్రలలో నిరంతర ప్రయోగాలు, సవాళ్లను అధిగమించి ఆయనను సినిమా పరిశ్రమలో అజేయ విజేతగా నిలబెట్టాయి. భగవంత్ కేసరి విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగా అపూర్వ విజయం సాధించి, ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును గెలుచుకుంది. అంతేకాక, ఆయన సినిమా మరియు సమాజ సేవలకు గుర్తింపుగా భారతదేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన *పద్మ భూషణ్*తో సత్కరించబడ్డారు.