టాలీవుడ్‌లో మోస్ట్ వైరల్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్న నాగవంశీ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతానికి మైథాలజీ లేదా మన పురాణాలకు సంబంధించిన కథలు చెప్పే సినిమాలు బాగా వర్క్ అవుట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా కార్తికేయ స్వామికి సంబంధించిన సినిమా ఒకటి చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే, మరొక పురాణ గాథకు సంబంధించిన సినిమా పట్టాలెక్కించే పనిలో పడ్డాడు.
Also Read :Kollywood : 96 దర్శకుడితో మలయాళ స్టార్ హీరో.. ఇక రక్తపాతమే
దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రామాయణంలోని సుందరకాండ ఎపిసోడ్‌కు సంబంధించి ఒక సినిమా ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు అధికారికంగా ప్రకటించనున్నారు. నిజానికి, గత కొన్నాళ్లుగా వచ్చిన కార్తికేయ, కార్తికేయ 2, ఆ తర్వాత వచ్చిన హనుమాన్, కాంతారా, సహా ఈ మధ్య వచ్చిన మహావతార నరసింహ సినిమాలు ఇండియన్ పురాణ కథలకు సంబంధించి ఒక ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు అదే బాటలో చందు మొండేటి, నాగవంశీ సినిమా కూడా ఉండే అవకాశం కనిపిస్తోంది.