Nagarjuna Throwback Hot Comments on Sobhita Dhulipala goes Viral: గత కొంత కాలంగా నాగచైతన్య, శోభిత దూళిపాళ లవ్‌లో ఉన్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. ఫైనల్‌గా రూమర్స్ నిజం చేస్తూ.. చైతన్య, శోభిత నిశ్చితార్థం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కింగ్ నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో.. చైతన్య, శోభితలకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నెటిజన్లు. గురువారం ఉదయం 9:42 నిమిషాలకు శోభిత-చైతన్యలు రింగ్స్ మార్చుకున్నారు. ఈ విషయాన్ని టాలీవుడ్ కింగ్, నాగచైతన్య తండ్రి నాగార్జున సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. చై-శోభిత జంటకు నెటిజన్లు, టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Pawan Kalyan: అప్పుడు హీరో అడవులని కాపాడితే ఇప్పుడు చెట్లు నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు
‘నా కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఈరోజు ఉదయం 9.42 గంటలకు జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. శోభితను మా కుటుంబంలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. కొత్త జంటకు నా అభినందనలు. వీరి జీవితం మొత్తం సంతోషం, ప్రేమతో నిండాలని కోరుకుంటున్నా. దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. 8.8.8 అనంతమైన ప్రేమకు నాంది’ అని కింగ్ నాగార్జున ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ పోస్టులోనే చై-శోభిత ఎంగేజ్‌మెంట్ పోటోలను పంచుకున్నారు. అయితే.. ఇదే సమయంలో నాగార్జునకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 2018లో అడవి శేష్ నటించిన ‘గూఢచారి’ సినిమా సక్సెస్ మీట్‌లో శోభిత ధూళిపాళ గురించి నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘శోభితా ధూళిపాళ.. ఆమె చాలా బాగుంది. నేను ఇలా చెప్పకూడదు కానీ, సినిమాలో ఆమె చాలా హాట్‌గా ఉంది. నా ఉద్దేశ్యం ఆమెలో ఎంతో ఆకర్షణీయమైన విషయం ఉంది..’ అని నాగార్జున చెప్పుకొచ్చాడు. దీంతో.. నాగార్జున కాబోయే కోడలిపై షాకింగ్ కామెంట్స్ చేశారంటూ.. ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. దీనిపై రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్స్.