Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ప్రేక్షకులకు నాగార్జున, టబు కాంబినేషన్ అంటే ఒక మ్యాజిక్. ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఐకానిక్ జోడీ మళ్లీ తెరపైకి రాబోతోంది. కానీ, ఈసారి వారిద్దరి మధ్య ‘ప్రేమ’ లేదట! ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కింగ్ నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సీనియర్ నటి టబు ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను నవంబర్ 4వ తేదీ ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన చిన్న ప్రమోషనల్ వీడియోలో పాతకాలం నాటి రేడియో (బూమ్‌బాక్స్), చీరకట్టులో టబు నడుచుకుంటూ వెళ్తున్న బ్యాక్ లుక్ విజువల్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అయితే ఈ వీడియోలో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించిన అసలు పాయింట్ ఏంటంటే.. స్క్రీన్ పై “దిస్ టైమ్.. ఇట్స్ నాట్ లవ్” (ఈసారి.. ఇది ప్రేమ కాదు) అని రాసి ఉండటం!. నాగ్, టబు అనగానే అందరికీ అందమైన రొమాంటిక్ లవ్ స్టోరీనే గుర్తొస్తుంది. కానీ డైరెక్టర్ ఆర్.ఏ. కార్తీక్ మాత్రం ఈసారి ఈ ఇద్దరి మధ్య ఏదో బలమైన వైరం లేదా మునుపెన్నడూ చూడని సరికొత్త కోణాన్ని చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఒకప్పటి హిట్ పెయిర్ మధ్య ‘ప్రేమ లేదు’ అని నేరుగా చెప్పేయడం సినిమాపై అమాంతం క్యూరియాసిటీని పెంచేసింది. అక్కినేని ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, టీ-సిరీస్ సౌత్ బ్యానర్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా, 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. “ప్రేమ కాదు” అంటూ సరికొత్త అవతారంలో టబు ఎంట్రీ ఇవ్వబోతుండటంతో, నవంబర్ 4న రాబోయే ఆ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!.
Also Read
- Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
- Daredevil Movie: గ్రాండ్‌గా మొదలైన అజిత్ ‘డేర్‌డెవిల్’.. క్రేజీ క్యాస్టింగ్ వైరల్!
- RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
- Shivathmika: నేను హీరోయిన్గా చేస్తే సినిమా చెయ్యను అన్నాడు.. శివాత్మిక రాజశేఖర్ కామెంట్స్ వైరల్!
తాజావార్తలు
-
Nagarjuna King 100: ఐకానిక్ జోడీ ఈజ్ బ్యాక్: కానీ ఈసారి ‘ప్రేమ’ లేదు!
-
China Space Plane: అంతరిక్షంలో చైనా రహస్య విమానం.. అమెరికా నిఘా నివేదికలో కీలక వివరాలు.!
-
Hyderabad Clean and Traffic-Free : హైదరాబాద్‌కు కొత్త టార్గెట్.. క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్పు
-
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై కాసుల వర్షం.. దసరా ఉత్సవాల హుండీ ఆదాయం రూ.11.59 కోట్లు..
-
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’లో నాని లుక్ లీక్.. సెట్స్ నుంచి బయటికి వచ్చిన వీడియోలు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!