Itlu Arjuna : నవంబర్ 13న బాక్సాఫీస్ వార్.. అయినా తగ్గేదే లేదంటున్న నాగార్జున!

Itlu Arjuna Movie

Itlu Arjuna Movie

నవంబర్ 13.. ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అత్యంత క్రేజీ రిలీజ్ డేట్. ఇప్పటికే ఆ తేదీపై కన్నేసి చాలా సినిమాలు క్యూ కట్టాయి. థియేటర్ల కోసం భారీ క్లాష్ తప్పని ఈ పరిస్థితుల్లో, కింగ్ నాగార్జున ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఒక సరికొత్త ప్రయోగాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అదే ‘ఇట్లు అర్జున’. ఓ వైపు నవంబర్ 13న థియేటర్ల దగ్గర గట్టి పోటీ ఉన్నప్పటికీ, నాగ్ స్వయంగా సమర్పిస్తూ ఒక కొత్త హీరో సినిమాను రంగంలోకి దించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. నాగార్జునను అంతగా ఎట్రాక్ట్ చేసి, ఆ డేట్‌కు సినిమాను లాక్ చేసేలా చేసిన సెన్సేషనల్ పాయింట్.. ఇందులోని విలక్షణమైన కథాంశం. ఇదొక మూగ యువకుడి ప్రేమకథ. అనీష్ అనే కొత్త కుర్రాడు హీరోగా పరిచయం అవుతుండగా.. అర్జున్ అనే మూగవాడి పాత్రలో తన జీవితమంతా కీర్తిని మౌనంగా ప్రేమించే అద్భుతమైన పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించింది. ప్రేమ, హాస్యం, ఊహించని మలుపులతో సాగే ఈ చిత్రాన్ని చూసిన కింగ్ నాగార్జున.. కొత్త కాన్సెప్ట్‌కు, టేకింగ్‌కు ఫిదా అయిపోయి ఈ కుర్ర టీమ్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక మరో సాలిడ్ బ్యాకప్ కూడా ఉంది. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఈ సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారారు. ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ అనే కొత్త బ్యానర్‌ను స్థాపించి మరీ మహేష్ ఉప్పల అనే డెబ్యూ డైరెక్టర్‌ను నమ్మి ఈ డిఫరెంట్ లవ్ స్టోరీని నిర్మించారు. దీనికి తోడు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అందించిన పాటలు ఇప్పటికే బజ్ క్రియేట్ చేశాయి. రాక్ స్టార్ అనిరుధ్ పాడిన ‘హాయ్ రే’, మోహిత్ చౌహాన్ ‘చిన్ని చిన్ని’, విశాల్ మిశ్రా ‘ఎల్లో చున్నీ’ సాంగ్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్‌లో ఓ భారీ క్యాలెండర్‌పై పింక్ అవుట్‌ఫిట్‌లో ఉన్న అనస్వర, స్టైలిష్ లుక్‌లో ఉన్న అనీష్ కూర్చున్న విజువల్ ఆకట్టుకుంటోంది. కొత్త హీరో, కొత్త డైరెక్టర్ అయినా సరే.. కంటెంట్ మీద ఉన్న బలమైన నమ్మకంతో ఒక మౌన ప్రేమికుడి కథను కింగ్ నాగార్జున అండతో నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. మరి ఇన్ని సినిమాల క్లాష్ మధ్యలో వస్తున్న ఈ ‘ఇట్లు అర్జున’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.