Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో ఒక భారీ ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ సిద్ధమైంది. అదే “నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్”. ‘నిక్ స్టూడియోస్’ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి నిర్మించిన ఈ విజువల్ వండర్‌కు అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. హీరో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ లీడ్ రోల్స్ పోషిస్తోన్న ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి విలేకరుల సమావేశంలో పాల్గొని, సినిమాకు సంబంధించిన ఎన్నో సంచలన విషయాలను పంచుకున్నారు.
ఐటీ రంగం నుండి ఇండస్ట్రీకి
నిర్మాతలు తమ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్తూ.. “మేము సాఫ్ట్వేర్ కంపెనీని విజయవంతంగా రన్ చేసి, అక్కడి నుండి ఎగ్జిట్ అయ్యాక బిజినెస్‌ను విస్తరించాలనే ఉద్దేశంతో సినిమా రంగంలోకి వచ్చాం. మొదట ఒక పెద్ద హీరోతో సినిమా చేయాలనుకున్నా.. మేము కొత్తవాళ్లం కావడంతో ఆ ఛాన్స్ రాలేదు. ఆ సమయంలోనే అభిషేక్ నామా చెప్పిన లార్జర్ దాన్ లైఫ్ మైథాలజీ లైన్ మాకు మైండ్ బ్లాక్ చేసింది. కథ డెవలప్ అయ్యే కొద్దీ కంటెంట్‌పై మాకు నమ్మకం డబుల్ అయింది. అందుకే కొత్త హీరో, కొత్త డైరెక్టర్ అని చూడకుండా ఏకంగా రూ. 110 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అద్భుతంగా నిర్మించాం” అని స్పష్టం చేశారు.
Also Read
నిజమైన గుడిని తలపించే అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్!
ఈ సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒక విజువల్ వండర్ ప్రేక్షకులను థ్రిల్ చేయబోతోందని మేకర్స్ లీక్ ఇచ్చారు. “ఔట్‌డోర్ లొకేషన్స్‌లో మేము అనుకున్న గ్రాండియర్ రావడం సాధ్యం కాదనిపించింది. అందుకే ఎక్కడ విజువల్ ఎఫెక్ట్స్ వాడాలో, ఎక్కడ సెట్ వేయాలో పక్కా ప్లాన్ చేసుకున్నాం. ముఖ్యంగా ఈ సినిమా కోసం వేసిన అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ సినిమాకే ప్రాణం. ఆ సెట్ చూసిన ప్రతి ఒక్కరూ నిజమైన గుడిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతోందని చెప్తున్నారు. మేము పెట్టిన ప్రతి పైసా సిల్వర్ స్క్రీన్ పై ఒక విజువల్ ఫీస్ట్‌లా కనిపిస్తుంది.”
రథయాత్ర ప్రమోషన్స్ సంచలనం!
సినిమా నిర్మాణంలో తమకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలను నిర్మాతలు గుర్తు చేసుకున్నారు. “మాకు దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజూ శివుని అభిషేకంతోనే మా రోజు మొదలవుతుంది. మేము ఈ ఇండస్ట్రీకి వచ్చి ఇంత భారీ సినిమా తీయడం వెనుక అనంత పద్మనాభస్వామి, శివుడి అనుగ్రహం ఉందని నమ్ముతాం. కార్తీక పౌర్ణమి రోజున 24 గంటల పాటు అభిషేకం జరుగుతుండగా మా లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. అలాగే మేము ప్రమోషన్స్ లో భాగంగా చేసిన రథయాత్ర వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.” అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!