NTR 31 to be Launched tomorrow without Media Coverage: గతంలోనే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. అయితే.. అప్పటికే ప్రశాంత్ నీల్, ప్రభాస్ ‘సలార్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కూడా దేవర కమిట్ అయ్యాడు. ఇక ఇప్పుడు దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు వార్2 కూడా కంప్లీట్ చేయబోతున్నాడు తారక్. ఇక ప్రభాస్ డేట్స్ లేకపోవడంతో.. సలార్ 2ని పక్కకు పెట్టేశాడు ప్రశాంత్ నీల్. దీంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆగష్టు 9న అంటే రేపే రామనాయడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కానుంది. అయితే.. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు కదా.. ఈ ఓపెనింగ్ సెర్మనీకి మీడియా కవరేజ్ కూడా ఉండదని తెలుస్తోంది.
Double ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ట్రిపుల్ ఇస్మార్ట్?
ఎన్టీఆర్ 31 ప్రారంభ కార్యక్రమం సాదాసీదాగా జరుగనుందట. అయితే.. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు బయటకు రిలీజ్ చేయనున్నారని సమాచారం. కానీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసినప్పుడు.. సెలబ్రేట్ చేసుకున్నారు. ఎందుకంటే.. కెజియఫ్, సలార్ వంటి బిగ్గెస్ట్ హిట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా ఇది. పైగా ఎన్టీఆర్ తన అభిమాన హీరో కావడమే కాదు, ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా ఇదే. మామూలుగానే నీల్ తన హీరోలను నెక్స్ట్ లెవల్ అనేలా చూపిస్తుంటాడు. అలాంటిది ఎన్టీఆర్‌ను ఇంకే రేంజ్‌లో ఎలివేట్ చేస్తాడనే ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. అందుకు తగ్గట్టే.. ఈ సినిమా ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. మరి ఇలాంటి విషయాల్లో మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.