Naga Babu: అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది.. శివాజీ కామెంట్స్‌పై నాగబాబు ఫైర్!
- టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపిన శివాజీ కామెంట్స్
- సోషల్ మీడియా, న్యూస్ ఛానెల్స్‌లో చర్చనీయాంశంగా శివాజీ కామెంట్స్
- శివాజీ కామెంట్స్‌పై నాగబాబు ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటుడు శివాజీ ఇటీవల మహిళల డ్రెస్‌ల విషయంలో చేసిన కామెంట్స్ టాలీవుడ్‌లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. శివాజీ కామెంట్స్ సోషల్ మీడియా, న్యూస్ ఛానెల్స్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలువురు నటీమణులు స్పందించగా.. తాజాగా జనసేన నేత, నటుడు నాగబాబు స్పందించారు. శివాజీ తన టార్గెట్ కాదని, మన సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉందన్నారు. మగ అహంకారంతో ఆడ పిల్లల వస్త్రధారణపై మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది? అని నాగబాబు ప్రశ్నించారు.
‘జనసేన నేతగా, ఎమ్మెల్సీగా, రాజకీయనాయకుడిగా, ఓ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా కాదు.. ఒక సామాన్య వ్యక్తిగా ఈ విషయం గురించి మాట్లాడుతున్నాను. ఇటీవలి కాలంలో చాలా మంది మహిళల వస్త్రధారణపై మాట్లాడుతున్నారు. తాజాగా శివాజీ మాట్లాడాడు. నేను శివాజీని టార్గెట్ చేయడం లేదు. ఒకవేళ మీరు అలా అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. సమాజంలో మోరల్ పోలీసింగ్ అనే సామాజిక రుగ్మత ఉంది. ఆడపిల్లలు ఎలా ఉండాలి, వాళ్లు ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే విషయాలపై ప్రతి ఒక్కరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం రాజ్యాంగం ప్రకారం తప్పు’ అని నాగబాబు అన్నారు.
Also Read
- Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
- Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
- Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!".
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
Also Read: 2025 Analysis: బాక్సాఫీస్ వద్ద తడబడ్డ స్టార్ హీరోలు.. సత్తా చాటిన యువ హీరోస్!
‘వస్త్రధారణ అనే ది పూర్తిగా స్త్రీల వ్యక్తిగత హక్కు. ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరించాలి అనే విషయంలో ఎవరికీ ఆదేశాలు ఇచ్చే హక్కు లేదు. ఆడవాళ్లు ఇలా మాత్రమే డ్రెస్‌లు వేసుకోవాలి అని చెప్పడానికి ఎవడికీ హక్కు లేదు. ప్రతి అమ్మాయికి ఆత్మగౌరవం ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్ ఎన్నో రకాలుగా మారుతూ ఉంటుంది. ప్రతి ఆడపిల్లను కుటుంబసభ్యురాలి మాదిరిగానే చూడండి. మగవారితో సమానంగా బతికే హక్కు మహిళలకు ఉంటుంది. మీరు ఎలాంటి దుస్తులైనా ధరించండి కానీ.. బయటకు వెళ్లేటప్పుడు మాత్రం మీ రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నేను మగవాళ్లందరినీ తప్పు పట్టడం లేదు, కొందరి గురించి మాత్రమే చెబుతున్నా. ఇలాంటి అంశంపై స్పందించడం అందరి బాధ్యత’ అని నాగబాబు చెప్పుకొచ్చారు.
వస్త్రధారణ స్త్రీల వ్యక్తిగత హక్కు. Moral policing is against the Constitution.
Moral policing is unconstitutional in India. Courts have repeatedly held that it violates fundamental rights such as liberty, dignity, privacy, and equality guaranteed under Articles 14, 19, and 21… pic.twitter.com/t927DNMnNV
— Naga Babu Konidela (@NagaBabuOffl) December 27, 2025
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!