Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” కల్కి 2898 AD “.ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమా లో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.దీనితో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుండి స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేసారు.
Read Also :Hanshita Reddy : గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు కూతురు..
బుజ్జి ఎవరంటే.. ఒక రోబోటిక్ కార్ ,అంతే కాదు ఈ సినిమాలో ప్రభాస్ కు క్లోజ్ ఫ్రెండ్ కూడా..ఈ బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది.బుజ్జి పేరు చిన్నగా ఉన్న కూడా ఈ సినిమాలో దీని పాత్ర ఎంతో ప్రత్యేకమని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.కల్కి సినిమా రిలీజ్ ఇంకా కొన్ని వారాలు మాత్రమే ఉండటంతో మేకర్స్ బుజ్జితో స్పెషల్ ప్రమోషన్స్ చేయిస్తున్నారు.దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బుజ్జి కారును తిప్పుతూ మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బుజ్జి కారు చెన్నై రోడ్లపై సందడి చేస్తుంది.చెన్నై రోడ్లపై సందడి చేస్తున్న బుజ్జి వీడియో బాగా వైరల్ అవుతుంది.ఈ వీడియోను డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎలాన్ మస్క్ కు ట్యాగ్ చేశాడు. “ప్రియమైన ఎలన్ మస్క్ సర్. మా బుజ్జిని చూడటానికి, నడపడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. ఇది 6 టన్నుల బరువున్న ఎలక్ట్రిక్ వెహికల్.ఈ కార్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇది మీకు ఒక గొప్ప అనుభూతి ఇస్తుంది” అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ బాగా వైరల్ అవుతుంది.
Dear @elonmusk sir… We would love to invite you to see and drive our #Bujji… it's a 6 ton beast, fully #madeinindia Fully Electric & an engineering feat.. And I daresay it'll make for a great photo-op with ur cybertruck 😬 (would be a sight to see them drive together)
— Nag Ashwin (@nagashwin7) May 28, 2024