తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఎప్పుడూ తన స్పష్టమైన అభిప్రాయాలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన రాబోతున్న చిత్రం ‘మదరాసి’ . శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన ‘మదరాసి’ సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో మాట్లాడిన మురుగదాస్, భారతీయ బాక్సాఫీస్ పై రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read :Khaidi 2 : లోకేష్ డిమాండ్ వల్లే ‘ఖైదీ 2’ వాయిదా..?
ప్రస్తుతం బాలీవుడ్, తెలుగు సినిమాలు రూ.1000 కోట్ల వసూళ్లు సాధిస్తుంటే, తమిళ సినిమాలు ఆ రేంజ్ ఎందుకు అందుకోవడం లేదనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. “తమిళ చిత్రాలు ఎక్కువగా కథా ప్రాధాన్యతతో వస్తాయి. మా డైరెక్టర్లు ఎప్పుడూ ఒక మెసేజ్, ఎడ్యుకేషన్ పాయింట్ జోడించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఇతర భాషల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందుకే రూ.1000 కోట్ల క్లబ్‌లో తమిళ సినిమాలు చేరడం కాస్త ఆలస్యం అవుతుంది” అని స్పష్టంగా తెలిపారు. అయితే ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
కొంతమంది సినీ ప్రేమికులు మురుగదాస్ అభిప్రాయాన్ని సమర్థిస్తూ కామెంట్ పెడుతుండగా, మరికొందరు మాత్రం ‘ప్రస్తుతం ఆడియన్స్ టేస్ట్, టెక్నాలజీ, మేకింగ్ లెవెల్ అన్నీ మారిపోయాయి. సినిమా అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌నే. ఆ రేంజ్‌కు వెళ్లాలంటే హాలీవుడ్ లెవెల్ మేకింగ్ కావాలి’ అంటూ రిప్లై ఇస్తున్నారు.