ప్రముఖ తమిళ దర్శకుడితో త్రిష పెళ్లి ?

పాపులర్ సౌత్ హీరోయిన్ త్రిష పెళ్లి అంశం మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 38 ఏళ్ల ఈ నటి త్వరలో ప్రఖ్యాత తమిళ దర్శకుడిని వివాహం చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. త్రిష వివాహం గురించి ఊహాగానాలు ఫిల్మ్ సర్కిళ్లలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. అయితే ఈసారి ఒక సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వినికిడి.

Read Also : విజయ్ ఆంటోనీ దర్శకుడిగా ‘బిచ్చగాడు 2’

గత కొన్ని రోజులుగా నటి పెళ్లి వార్తల చుట్టూ చాలా వార్తలు వస్తున్నప్పటికీ ఆమె ఇంతవరకూ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కొద్ది రోజుల క్రితం త్రిషకు ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగిందని పుకారు వచ్చింది. అయితే అది కేవలం రూమర్ మాత్రమే అని తేలింది. కాగా గతంలో ఈ బ్యూటీ ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం చేసుకుని, పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయిన విషయం తెలిసిందే. త్రిష 2003లో ‘మౌనమ్ పెసియాధే’ చిత్రంతో హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 17 ఏళ్లుగా తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆమె ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో కనిపించనుంది.

Related Articles

Latest Articles

-Advertisement-