శ్రీనివాస్‌రెడ్డి, ‘దియా’ ఫేమ్ దీక్షిత్ శెట్టి, ‘వెన్నెల’ రామారావు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఫస్ట్ లుక్, ట్రైలర్ తోనే మంచి బజ్ ను క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆగస్ట్ 6న థియేటర్లలో విడుదలైంది. దివ్యాంగులైన ముగ్గురు యువకులు ఓ మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నారు? దాని నుండీ ఎలా బయటపడ్డారు? అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీనివాసరెడ్డికి వినపడదు, దీక్షిత్ శెట్టి మాట్లాడలేడు, ‘వెన్నెల’ రామారావుకు కనపడదు. ఈ ముగ్గురు నటులూ తమదైన శైలిలో నటించి, కథను రక్తి కట్టించారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రెండో స్థానంలో తమ ‘ముగ్గురు మొనగాళ్ళు’ ట్రెండ్ కావడం ఆనందంగా ఉందని నిర్మాత ‘వెన్నెల’ రామారావు తెలిపారు. ‘గరుడ వేగ’ అంజి అందించిన విజువల్స్, సురేష్ బొబ్బిలి బాణీలు, చిన్న నేపథ్య సంగీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలుగా నిలిచాయని ఆయన చెప్పారు. ఈ మూవీ ద్వారా అభిలాష్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇదిలా ఉంటే ‘వెన్నెల’ రామారావు నిర్మించిన ‘రోజ్ విల్లా’ మూవీ సైతం అక్టోబర్ 1న విడుదలైంది.