భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘మోతెవరి లవ్ స్టోరీ’ అనే సిరీస్ ఆగస్టు 8 నుండి స్ట్రీమింగ్‌కి రాబోతోంది. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించగా, మధుర శ్రీధర్ రెడ్డి, శ్రీరామ్ శ్రీకాంత్ నిర్మాతలు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోందని ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో స్పష్టమైంది. ఇందులో భాగంగా తాజాగా శుక్రవారం ఈ మూవీ నుంచి ‘గిబిలి గిబిలి’ అనే పాటను మేకర్స్ విడుదల చేశారు.
Also Read : Chiranjeevi : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు చిరంజీవి శుభాకాంక్షలు..
హీరోయిన్‌కు తన మనసులోని ప్రేమను హీరో వ్యక్తం చేసే క్రమంలో ఈ ‘గిబిలి గిబిలి’ పాట వస్తుంది. సోషల్ మీడియాలో ఫ్రీక్వెంట్‌గా ఉపయోగించే పదాలతో ఈ పాటను రాయటం అందరినీ ఆకట్టుకుంటోంది. మల్లెగోడ గంగ ప్రసాద్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ పాడగా, చరణ్ అర్జున్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. అనిల్ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అరుపుల సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నారు. అనీల్ గీల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.