టాలీవుడ్ యంగ్ నటుడు ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మిత్ర మండలి’. విజయేందర్ స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకక్కిన ఈ సినిమాలో వెనెల్లా కిషోర్, సత్య, విటివీ గణేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తనదైన కామెడీ టైమింగ్, పంచులతో అలరించే ప్రియదర్శి ఈ మూవీలోనూ మరోసారి కామెడీతో ఎంటర్‌టైన్‌మెంట్ అందించబోతున్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆద్యంతం నవ్వులతో టీజర్ ఆకట్టుకుంది.
ఇక తాజాగా ఈ చిత్ర బృందం మొదటి సింగిల్‌ను విడుదల చేశారు. ‘కత్తి అందుకో జానకి’ అనే టైటిల్‌తో వచ్చిన ఈ ఉత్సాహభరితమైన పాటకు సంగీత దర్శకుడు ఆర్‌ఆర్ ధ్రువన్ పప్పీ ట్యూన్ కంపోజ్ చేయగా, సాహిత్యం కసార్లా శ్యామ్ రచించారు. రాహుల్ సిప్లిగంజ్ తన శక్తివంతమైన గాత్రంతో ఈ పాటను ఆలపించారు. కాగా ఈ సాంగ్ చూసుకుంటే బస్తిలో ఉండే కుర్రలు ఎలా ఉంటారో చూపించనున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ మూవీలో ప్రియదర్శి సరసన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక ఎన్ఎం హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆమె ఈ మూవీతోనే తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రజంట్ ప్రియదర్శి వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. కోర్టు, సారంగపాణి జాతకం మూవీస్‌తో మంచి విజయం అందుకోగా ఈసారి కూడా అదిరే కామెడీ ఎంటర్‌టైనర్‌తో మరో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.