Mimoh Chakraborty : టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న మిథున్ చక్రవర్తి కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ బాలీవుడ్ నటుడు, సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి కుమారుడు మిమో చక్రవర్తి, ఎయిర్ టెల్ ఫేం సాషా చెత్రి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘నేనెక్కడున్నా’. కేబీఆర్ సమర్పణలో మారుతి శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాతో మాధవ్ కోదాడ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫిబ్రవరి 28న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు గంగాధర్, గోపీనాధ్ రెడ్డితో పాటు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.
హీరో మిమో చక్రవర్తి మాట్లాడుతూ ”ఈ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. ఫిబ్రవరి 28న విడుదలకాబోతున్న ఈ సినిమా కోసం ఎంతో ఎగ్జయిటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. అందరూ చాలా గొప్పగా నటించారు. ఈ సినిమాకు మెయిన్ హీరో మాధవ్ గారు. మా నాన్నగారిలా నేను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భాగమవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాన”ని అన్నారు.
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
- Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
హీరోయిన్ సాషా చెత్రి మాట్లాడుతూ ”అందరూ సమయం కేటాయించి ఈ వేడుకకు వచ్చినందుకు థ్యాంక్యూ. డైరెక్టర్ మాధవ్ గారికి ధన్యవాదాలు. చాలా గొప్ప సినిమా ఇది. మహిళలపై ఇలాంటి సినిమా, నేను ప్రధాన పాత్రలో నటించడం అంతా డ్రీమ్‌లా ఉంది. చిత్రీకరణ సమయంలో చాలా ఇబ్బందులు ఫేస్ చేశాం. నేను ఈ దేశానికి చెందిన బిడ్డను, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ”ఇందులో నటించిన సషా భారతదేశం మొత్తానికి తెలుసు. 4జీ యాడ్‌తో ఆమె అందరికీ పరిచయమైంది. ఆ యాడ్‌తో మారుమూల పల్లెటూళ్లలో కూడా ఆమె మంచి పాపులరిటీని సొంతం చేసుకున్న సషా ఇందులో హీరోయిన్‌గా నటించింది.ట్రైలర్ కూడా చాలా బాగుంది. హీరో మిమో చక్రవర్తి కూడా వాళ్ల నాన్న మిథున్ చక్రవర్తిలా తెలుగులోనే మొదటి సినిమా చేస్తున్నారు. ఆయనలానే ఈయన కూడా సక్సెస్ అవ్వాలని, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!