టాలీవుడ్ యువ నటులు ప్రియదార్షి, రాగ్ మయూర్, విష్ణు ఓయి, ప్రసాద్ బెహారా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. విజయేందర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. కాగా ఈ టీజర్ నాన్ స్టాప్ కామిడితో ప్రతి ఒక్క క్యారెక్టర్ మధ్య ఉన్న కెమిస్ట్రీ, చమత్కారమైన డైలాగ్స్ అన్నీ కలిపి ఒక హిలేరియస్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా యువతలో ఈ టీజర్‌కి మంచి స్పందన వస్తోంది.
Also Read : Nikhil : ‘ది ఇండియా హౌస్’ సెట్‌లో ప్రమాదం పై.. స్పందించిన నిఖిల్
అలాగే నటి నిహారిక ఎన్ ఎం సాలిడ్ పాత్రలో కనిపించగా. ఈ గ్యాంగ్‌లో వీటీవి గణేష్‌కి ఏదో క్లాష్ ఉంటుంది అనిపిస్తుంది. అలాగే ఆయన పై చూపించిన కొన్ని పేరడీ సన్నివేశాలు కూడా బాగున్నాయి. దాదాపు టాలీవుడ్ స్టార్ కమిడియన్స్ అందరిని ఈ మూవీలో గ్యాదర్ చేశాడు దర్శకుడు. అలాగే సినిమా కెమెరా వర్క్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ టీజర్‌లో క్వాలిటీగా కనపడుతున్నాయి. సినిమాను టెక్నికల్‌గా కూడా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లే ప్రయత్నం స్పష్టంగా తెలుస్తోంది. ఇక మొత్తానికి మరో క్రేజీ ఫన్ డ్రామా టాలీవుడ్ నుంచి రాబోతుంది అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.