Missing Meghana: జావేద్ అలీ గాత్రంతో “మిస్సింగ్ మేఘన” ఫస్ట్ సింగిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్లపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మాణంలో, వాచస్పతి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘మిస్సింగ్ మేఘన’. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ విడుదల కాగా, తాజాగా లెజెండరీ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు చేతుల మీదుగా ఈ చిత్రంలోని మొదటి పాట “పిల్ల పిల్ల పిల్ల”ను ఘనంగా లాంచ్ చేశారు.
పాటను విడుదల చేసిన అనంతరం ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ… “పిల్ల పిల్ల పిల్ల” సాంగ్ మెలోడీ చాలా హాయిగా, బాగుందని మెచ్చుకుంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిర్మాత పంచుమర్తి నరేష్ బాబు మాట్లాడుతూ… తమ సినిమా పూజా కార్యక్రమాలు చారిత్రాత్మక రామానాయుడు స్టూడియోలోనే ప్రారంభమయ్యాయని, ఇప్పుడు అదే స్టూడియోస్ అధినేత, గోల్డెన్ హ్యాండ్ సురేష్ బాబు చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ రావడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్. ధృవన్ కాంబినేషన్లో తమకు ఇది రెండో ప్రాజెక్ట్ అని, ధృవన్ బాణీలు కట్టి, స్వయంగా రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు జావేద్ అలీ అద్భుతంగా ఆలపించారని పేర్కొన్నారు.
హీరో రామ్ కార్తీక్, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్. ధృవన్ తమ సంతోషాన్ని పంచుకుంటూ… రామానాయుడు స్టూడియోస్ నుంచి ఈ పాట విడుదల కావడం ఒక మంచి అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. దర్శకుడు వాచస్పతి ఈ చిత్రాన్ని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మలిచారని, శామ్.కె.నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. ఈ లాంచ్ కార్యక్రమంలో నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, కో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోపరాజు రమణ, నళిని, కౌశిక్, మహిపాల్ లాంటి సీనియర్ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ ‘మిస్సింగ్ మేఘన’ త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
Also Read
- OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
- Prabhas : మలయాళం ఊచకోత డైరెక్టర్ తో ప్రభాస్?
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10లోకి ఎంట్రీ ఇచ్చే 10 మంది వీళ్లే ?.. లిస్ట్ ఇదిగో!
- NTV Exclusive: ‘మండాడి’ కోసం 45 రోజులు సముద్రంలోనే.. నాలుగైదుసార్లు చావు అంచుల వరకు వెళ్లాం: సుహాస్
తాజావార్తలు
-
Rythu Shankaravam: ‘రైతు శంఖారావం’కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
-
OTT Releases: ఈ వారం ఓటీటీ సినిమాలు… థ్రిల్లర్, కామెడీ, హారర్‌తో సరికొత్త లైనప్
-
Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
-
Lenskart Investorsకు గుడ్ న్యూస్.. షేర్లో 40% అప్‌సైడ్ ఉందంటున్న నోమురా!
-
Psychology Facts: ‘లైట్ తీసుకో, పట్టించుకోకు..’ ఈ మాటలతో నష్టమే ఎక్కువ!
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!