‘హనుమాన్’ సినిమాతో హీరోగా తేజ సజ్జా మార్కెట్ ఎలా పెరిగిందో తెలిసిందే. దెబ్బకు మూడు వందల కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయాడు. అయితే హనుమాన్ వచ్చి ఏడాది దాటిపోయింది. కానీ ఇంకో కొత్త మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోతున్నాడు. గత ఏడాది తేజ సజ్జా ‘మిరాయ్’ అనే ప్రాజెక్టుని ప్రకటించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ యాక్షన్-అడ్వెంచర్ లో, తేజ సజ్జా సూపర్ యోధ పాత్రలో కనిపించనున్నాడు.
Also Read : Venu : ‘ఎల్లమ్మ’ మూవీ పై అప్డేట్ ఇచ్చిన దర్శకుడు వేణు..
ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. నిర్మాత ముంబైలోని చారిత్రాత్మక గుహలలో సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ ను ప్రారంభించాడు. తేజ సజ్జా తో పాటు, కొంతమంది ప్రధాన పాత్రలు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. ఆగస్టులో విడుదల డేట్ అనుకోగా ఆ గడువుకు చేరుకోవడానికి సినిమాకు సంబంధించిన పనులు.. షెడ్యూల్ ప్రకారం స్పీడ్ గానే జరుగుతున్నాయి. ఇక రాకింగ్ స్టార్ మనోజ్ మంచు ప్రతినాయకుడిగా, రితికా నాయక్ కథానాయికగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 8 వేర్వేరు భాషలలో 2D మరియు 3D ఫార్మాట్లలో గ్రాండ్ గా విడుదల అవుతుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.