మాస్ మహారాజ రవితేజ మళ్లీ తన అభిమానులకు ఫుల్టూ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు. రవితేజ నటించిన ‘మిరపకాయ్’ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా, ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. జులై 11న ‘మిరపకాయ్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. హనుమాన్ మీడియా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు, ఈ సినిమాలో అందాల భామ రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించగా, రమేష్ పుప్పల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ‘మిరపకాయ్’ మూవీ రీ-రిలీజ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Also Read : Vijay Devarakonda : కింగ్డమ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ట్రోల్స్.. స్వీట్ రిప్లై ఇచ్చిన నాగవంశీ..
అయితే ఈ సినిమాలో హీరోయిన్స్‌తో పాటు ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది మరో క్యారెక్టర్.. రిచా గంగోపాధ్యాయ్ ఫ్రెండ్ పాత్రలో కనిపించిన స్నిగ్ధ. నటనా శైలితో పాటు తన ప్రత్యేకమైన వాయిస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్నిగ్ధ, అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది. తాజాగా ‘మిరపకాయ్’ రీ-రిస్ట్ ప్రకటన వెలువడిన నేపథ్యంలో, స్నిగ్ధ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. “మాస్ రాజా రవితేజ కుమ్మేసిన బ్లాక్‌బస్టర్ ‘మిరపకాయ్’ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. తప్పకుండా చూడండి!’ అంటూ ఆమె ఓ పోస్ట్ కూడా చేసింది. కానీ ఈ వీడియోలో ఆమె రూపం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. ఎందుకంటే ఆమె పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.