రౌడీ హీరో విజయ్ దేవరకొండలో మునుపటి స్పీడు, ఆ జోష్ కనిపించడం లేదు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో హీరోగా సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రూపొందించిన ‘లైగర్’ దారుణమైన డిజాస్టర్ తరువాత చాలా కామ్ అయిపోయాడు. తర్వాత ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నుంచి బ్యాడ్ ఫేజ్‌ని ఎదుర్కొంటున్న ఆయన ఇకనైనా మళ్లీ ఓల్డ్ ట్రాక్‌లోకి రావాలని, తనదైన మార్కు సినిమాతో మళ్లీ బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయాలని రౌడీ బాయ్స్ కోరుకుంటున్నారు. అందుకే అంతే కసితో ‘కింగ్‌డమ్’ మూవీతో రాబోతున్నారు.
Also read : Rukmini Vasanth : రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదేలే..
కానీ ఈ సినిమాకు అనుకోని అడ్డంకులు ఎదురవుతూ రిలీజ్ నిరవధికంగా వాయిదాపడుతూ వస్తోంది. ఇప్పటికే రెండు మూడు సార్లు రిలీజ్ వాయిదాపడుతూ వచ్చింది. దీంతో సినిమా పై క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని మేకర్స్, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమలు’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు నాగవంశీ. దీంతో విజయ్ అభిమానులు రంగంలోకి దిగి ‘కింగ్‌డమ్’ అప్ డేట్ పై కామెంట్స్ చేశారు.
‘కింగ్‌డమ్’ టీజర్ ఎప్పుడు?, సాంగ్ ఏంటి?, రిలీజ్ డేట్ చెప్పండి! అంటూ నెటిజన్లు వరుసగా ప్రశ్నల వర్షం కురిపించడంతో నిర్మాత నాగవంశీ ఒక భావోద్వేగపూరిత స్టేట్మెంట్‌తో స్పందించారు.. ‘ ఏం పోస్ట్ చేసినా… రాజ్యం తీపి శాపాలు వస్తాయన్నది నాకు తెలుసు. కానీ నన్ను నమ్మండి – మా టీమ్ మీకు భారీ స్క్రీన్ అనుభవాన్ని అందించేందుకు అహోరాత్రులు పని చేస్తుంది. త్వరలోనే టీజర్, మ్యూజిక్ సాంగ్, అలాగే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు.