Miracle Movie: హెబ్బా పటేల్ కొత్త సినిమా.. ‘మిరాకిల్’ చేద్దాం రండంటున్న హాట్ బ్యూటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రమేష్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగదాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మిరాకిల్’ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సత్య గ్యాంగ్, ఫైటర్ శివ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన ప్రభాస్ నిమ్మల ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ నటిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడో షెడ్యూల్‌ను ఈ నెల 24 (ఫిబ్రవరి 24) నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు. ఆ షెడ్యూల్‌లో హెబ్బా పటేల్ సెట్స్‌లో జాయిన్ కానున్నారు.
రణధీర్ భీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోలు శ్రీరామ్, సురేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాయుడు పెండ్ర ఈ సినిమాతో విలన్‌గా పరిచయం అవుతున్నారు. అలాగే సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ్ అప్పాజీ ఫోరెన్సిక్ ఆఫీసర్ పాత్రలో నటించడం విశేషం. జనార్దన్, యోగి కాత్రే, విజయ్ సూర్య, ఇంతియాజ్, సాయిబాబా, దిల్ రమేష్, ఝాన్సీ, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, నవ్య (అమ్ము), సమీర్ దత్తా, అనుశ్రీ, బెజవాడ మస్తాన్, ఆర్. కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
నిర్మాతలు మాట్లాడుతూ… ‘దర్శకుడు ప్రభాస్ నిమ్మల సత్యా గ్యాంగ్, ఫైటర్ శివ చిత్రాల తర్వాత మూడో చిత్రంగా మిరాకిల్తో మరో విజయాన్ని సాధించబోతున్నారు. హెబ్బా పటేల్ గ్లామర్, శ్రీరామ్ అండ్ సురేష్ పోషిస్తున్న కీలక పాత్రలు, ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. మూడో షెడ్యూల్ ఈనెల 24 నుంచి ప్రారంభమవుతుంది’ అని వెల్లడించారు. ఈ చిత్రానికి పి.ఆర్.ఓగా ధీరజ్-అప్పాజీ వ్యవహరిస్తుండగా.. కెమెరామెన్‌గా సురేందర్ రెడ్డి, ఎడిటర్‌గా విశ్వనాధ్ పని చేస్తున్నారు. రాంబాబు గోసాల సాహిత్యం అందిస్తుండగా.. ఫైట్స్‌ను శ్రీను రూపొందిస్తున్నారు. సహనిర్మాతగా శ్రీమతి జ్యోత్స్న వ్యవహరిస్తున్నారు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వ బాధ్యతలను ప్రభాస్ నిమ్మల స్వయంగా నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!